అవర్ సేక్రేడ్ స్పేస్ పూంపుహార్ మెగా హస్తకళల ప్రదర్శన

27-09-2026 | 05:10am

సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి): తెలంగాణలోని పూంపుహార్’(Poompuhar in Telangana) అనే బ్రాండ్ పేరుతో ప్రసిద్ధి తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్ర దర్శనలను నిర్వహించడం ద్వారా కళాకారు లు రూపొందించిన కళాఖండాలను కళాభిమానులకు చేరువ చేస్తోంది అన్ని అవర్ సే క్రేడ్ స్పేస్ వ్యవస్థాపకురాలు నయన తార అన్నారు. సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్పల్లి (సర్దార్ పటేల్ రోడ్, ఆర్కిడ్స్ ఫ్లవర్ పక్కన, హి మాలయ బుక్ వరల్ ముందు వద్ద ఉన్న ’అవర్ సేక్రేడ్ స్పేస్’ వేదికగా 10 రోజుల పాటు (ఆదివారంతో సహా) ‘మెగా హస్తకళల ప్రదర్శన ను నిర్వహిస్తోంది.

ఈ ప్రదర్శనను శనివారం అవర్ సేక్రేడ్ స్పేస్ వ్యవస్థాపకురాలు నయన తార, తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారుల సమక్షంలో ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. తెలంగాణలోని పూంపుహార్’ అనే బ్రాండ్ ఉత్పత్తులను ప్రోత్సహించి, విక్రయించడం ద్వారా కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ (పూంపుహార్) ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేకమైన సాంప్రదాయ హస్తక ళలు, చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి తమిళనాడులోని వివిధ జి ల్లాల నుండి 30 మంది కళాకారులు ఆహ్వానించబడ్డారు.

కళాకారులు తమ ఉత్పత్తుల ను కళాభిమానులకు నేరుగా అందుబాటు ధరలకు విక్రయిస్తారు. ఈ ప్రదర్శన వారి ఆ దాయాన్ని పెంచుతుందని, మరియువారి జీ వనోపాధికి తోడ్పడుతుందని అన్నారు.. ఈ ప్రదర్శనలో కంచు విగ్రహాలు, ఇత్తడి సాంప్రదాయ దీపాలు, తంజావూరు చిత్రాలు, తం జావూరు కళా ఫలకాలు, పేపియర్-మాషే బొ మ్మలు, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, ఇత్తడి కళాకృతులు,

మట్టి మరియు టెర్రకోట ఉత్పత్తులు, బెత్తపు ఫర్నిచర్, అరటి పీచు ఉత్ప త్తులు, జనపనార ఉత్పత్తులు, తాటాకు ఉత్పత్తులు, ఫ్యాషన్ ఆభరణాలు, అగరబత్తీలు, సుగంధ ద్రవ్యాలు, చేతితో నేసిన వస్త్రాలు, చేనేత వస్త్రాలు, ఇంకా అనేక ఇతర హస్తకళా ఉత్పత్తుల వంటి తమిళనాడు సాంప్రదాయ హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం. ఇది 26.09.2026 నుండి 04.10.2026 వరకు ప్రతిరోజూ (ఆదివారాల తో సహా) ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది అన్ని నిర్వాహకులు తెలియజేశారు.


మరిన్ని వార్తలు