వచ్చేది మా సర్కారే

27-09-2026 | 05:30am
  1. సర్వేలన్నీ మళ్లీ కేసీఆరే సీఎం అంటున్నయ్: కేటీఆర్
  2. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు
  3. అన్నవస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం పోతదని ముందే చెప్పినం
  4. హామీల్లో ఒక్కటీ కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శ

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాయని పేర్కొన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును ప్రజలు తెచ్చుకున్నారని.. అధికారంలోకి వచ్చి మూడేండ్లు దగ్గరపడు తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ సరిగ్గా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.

శనివారం తెలంగాణ భవన్‌లో మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి సత్తూరి యాదగిరి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆ ర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడారు. ‘మోసగాళ్లనే ప్రజలు నమ్ముతారని రేవంత్‌రెడ్డి ముందే చెప్పారు. పాత రోజులు తెస్తానని చె ప్పిన ఆయన.. నిజంగానే పాత రోజులను తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి నిజాయితీ గల మోసగాడు. పాలి చ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును ప్రజలు తెచ్చుకున్నారు. అన్న వస్త్రానికి పోతే.. ఉన్న వస్త్రం కూ డా పోతుందని ముందే చెప్పాం’ అని వ్యాఖ్యానించారు. 

ప్రజల గుండెల్లో కేసీఆర్..

ప్రజా తీర్పును గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ దూరంగా ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు దగ్గర కొస్తున్నా ఇప్పటికీ గల్లీ గల్లీలో కేసీఆర్ పాటలు వినిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ‘ప్రజల గుండెల్లో కేసీఆర్  గూడుకట్టుకున్నారు. కోదాడ, సూర్యాపేట వరకు సాగునీరు అందించిన ఆయనను ప్రజలు గు ర్తు చేసుకుంటున్నారు’ అని కేటీఆర్ తెలిపారు.

రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైం దని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ హయాంలో రైతులు నాట్లు వేసే సమయానికి రైతుబంధు డబ్బులు అందే వి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టింది. 100 రోజుల్లోనే అన్ని హా మీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్.. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఏమిటో ప్రజలకు తెలియజేయడానికి రాబోయే ఎన్నికలు కీలకమని.. తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దోపిడీ, అవినీతి పాలనను మార్చే అధికారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. కాగా, సెప్టెంబర్ 28 నుంచి గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.  


 

మరిన్ని వార్తలు