రెజ్లింగ్ ప్రపంచంలో విషాదం

28-09-2026 | 08:56am

ప్రొఫెషనల్ రెజ్లింగ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే విషాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా PACగా గుర్తింపు పొందిన బ్రిటిష్ స్టార్ రెజ్లర్ బెంజమిన్(Benjamin Satterley) సాటర్లీ 40 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మృతిని All Elite Wrestling (AEW) ప్రకటించింది. అయితే మరణానికి గల కారణాన్ని వెంటనే వెల్లడించలేదు. న్యూక్యాసిల్ అపాన్ టైయిన్‌కు చెందిన సాటర్లీ 2004లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టారు. బ్రిటన్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం WWE, AEW, New Japan Pro-Wrestling, Consejo Mundial de Lucha Libre వంటి ప్రముఖ రెజ్లింగ్ సంస్థల వరకు సాగింది.

WWEలో Adrian Neville పేరుతో అభిమానులను అలరించిన ఆయన.. AEWలో PACగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గాల్లో చేసే వేగవంతమైన విన్యాసాలు, అద్భుతమైన టెక్నిక్‌తో అభిమానులను ఆకట్టుకున్న సాటర్లీకి “The Man That Gravity Forgot” అనే పేరు వచ్చింది. 2019లో AEWలోకి వచ్చిన PAC.. 2022లో All-Atlantic Championship గెలుచుకున్నారు. Death Triangle, Death Riders వంటి గ్రూపుల్లో భాగంగా పలు విజయాలు సాధించారు. ఆయన చివరి మ్యాచ్ కూడా మరణానికి ఒక్కరోజు ముందే AEW ‘All Out’ ఈవెంట్‌లో జరిగింది. PAC మృతిపై సహచర రెజ్లర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. AEW వరల్డ్ ఛాంపియన్ విల్ ఓస్ప్రే, రెజ్లర్ ఈవిల్ యునో సహా పలువురు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. రింగ్‌లో వేగం, బలం, టెక్నిక్‌ను కలిపి ప్రత్యేక శైలిని సృష్టించిన PAC.. “Black Arrow”, “Brutalizer” వంటి మూవ్‌లతో రెజ్లింగ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేశారు.

మరిన్ని వార్తలు