విహారయాత్రలో విషాదం

28-09-2026 | 09:45am

37 మంది విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం.. స్వల్ప గాయాలు

అలంపూర్, సెప్టెంబర్‌ 28: గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై(NH 44 Bus Accident) తమిళనాడుకు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. తమిళనాడు సేలం నుంచి హైదరాబాద్‌ వండర్లాకు(Wonderla) విహారయాత్రకు వెళ్తున్న 37 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన విద్యార్థులను అలంపూర్‌(Alampur Bus Accident) చౌరస్తాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు