పెద్దదర్పల్లిలో వీధి దీపాల సమస్యకు పరిష్కారం
01-10-2026 | 09:58pm
హన్వాడ: మండలంలోని పెద్దదర్పల్లి గ్రామం(Peddatharpally village)లో వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ సిబ్బందితో కలిసి వివిధ వార్డుల్లో పనిచేయని దీపాలను పరిశీలించి మరమ్మతులు చేయించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివ, వార్డు సభ్యులు శివనీల, మనిల్, జీపీ వర్కర్ పాల్గొన్నారు.