కల్లేపల్లిలో పెన్షన్‌దారుల వెరిఫికేషన్
22-09-2026 | 05:50pm
బెజ్జంకి, సెప్టెంబర్ 22: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి(Kallepalli) గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల ఇంటింటి వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్ అనిత, సర్పంచ్ బిగుల్లా మోహన్ ఆధ్వర్యంలో వితంతు, ఒంటరి మహిళ, వికలాంగ పెన్షన్‌దారుల వివరాలను పరిశీలించారు. ఆధార్, వేలిముద్ర, బ్యాంకు ఖాతా వివరాలను తనిఖీ చేశారు.