పింక్ పవర్ రన్ 3.0 హైదరాబాద్ ముస్తాబు
27న హైదరాబాద్‌లో మెగా మారథాన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు రొమ్ము క్యాన్సర్ ముందస్తు నిర్ధారణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా సుధా రెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 3.0’ కు నగరం సిద్ధమవుతోంది. ఈనెల 27న నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ అంతర్జాతీయ హాఫ్ మారథాన్ను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబం ధించిన జెర్సీ, మెడల్స్ను సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధా రెడ్డి, 2025 మిస్ వరల్డ్ ఒపల్ సుచ తా చువాంగ్, బ్రెస్ట్ ఆంకోసర్జన్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి ఆవిష్కరించారు.
ఎయిమ్స్ గుర్తింపు..
తొలిసారిగా ఈ రన్‌లోని 21.097 కి.మీ. హాఫ్ మారథాన్‌కు అసోసియేషన్ ఆఫ్ ఇం టర్నేషనల్ మారథాన్స్ అండ్ డిస్టెన్స్ రేసెస్ అంతర్జాతీయ ధ్రువీకరణ లభించింది. దా దాపు 20 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. రూ.75 లక్షలతో 100 మందికి పైగా విజేతలకు నగదు బహుమతులు అందిస్తారు.
రేస్ విభాగాలు..
21.097 కి.మీ. హాఫ్ మారథాన్తో పాటు 10 కి.మీ., 5 కి.మీ., 3 కి.మీ. విభాగాలలో పరుగు పందెం నిర్వహించనున్నారు.
మైల్స్ ఫర్ మామోగ్రామ్స్..
ఏఐజి హాస్పిటల్స్తో కలిసి చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రన్నర్లు పూర్తి చేసే ప్రతి 100 కి.మీ. దూరానికి ఒకరికి ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ / మామోగ్రామ్ పరీక్షను ఫౌండేషన్ ఉచితంగా అందించనుంది. రమాబాయి రణ్వీర్ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు, ఆమె కుమార్తెల చదువుకయ్యే పూర్తి ఖర్చులను భరిస్తామని సుధా రెడ్డి ఫౌండేషన్ ప్రకటించింది.
ఉచిత వర్చువల్ రన్..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పాల్గొనేందుకు ఎటువంటి రుసుము లేకుండా ఉచిత వర్చువల్ రన్ సౌకర్యం కల్పించారు. హెచ్పిసిఎల్, బీపీసీల్, ఐఓసీల, ఏఐజీ, డెకాథ్లాన్ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ రన్కు ఐఫినిష్ డిస్ట్రిక్ట్ వేదికల ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
