ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు.. 17 దేశాల నుంచి న్యాయమూర్తులు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్(Vigyan Bhavan)లో శనివారం నాడు (The Future of Environment and Climate Dynamics) అంశంపై అంతర్జాతీయ సదస్సును ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న సదస్సును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(National Green Tribunal) నిర్వహిస్తోంది. ఇది పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, అలాగే జిల్లా కోర్టు న్యాయమూర్తులను ఒకచోట చేర్చుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు(High-ranking government officials) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్ర న్యాయ అకాడమీలు, రాష్ట్ర న్యాయ సేవా సంస్థలు, రాష్ట్ర నిపుణుల అంచనా కమిటీలు, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థలు, రాష్ట్ర చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సదస్సుకు 17 దేశాల నుండి ప్రముఖ న్యాయమూర్తులను, న్యాయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన(Environmental Governance) పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కీలక సదస్సులో విధాన రూపకల్పన, అమలు, ఆచరణలో ఉన్న లోపాలు వంటి కీలకమైన పర్యావరణ, వాతావరణ సవాళ్లపై చర్చిస్తారు. పర్యావరణ పరిపాలన, సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను కూడా ఈ సదస్సు అన్వేషిస్తుంది.