తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

26-09-2026 | 11:24pm
  1. సంతోష్‌ కనిపిస్తే సమాచారం ఇవ్వండి
  2. ముత్తారం ఎస్ఐ రవికుమార్

ముత్తారం, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి(Khammampalli village) చెందిన ఇల్లందుల సంతోష్‌(Illandula Santosh) (37), తండ్రి సత్తయ్య కొంతకాలంగా కనిపించకుండా పోయినట్లు ముత్తారం పోలీసులు(Muttaram Police) తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సంతోష్‌ మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంతోష్‌ను ఎవరైనా చూసినా, ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలిసినా వెంటనే ముత్తారం ఎస్‌ఐ 8712656531 లేదా 9866789884 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సంతోష్‌ ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తామని పోలీసులు తెలిపారు. సంతోష్‌ వివరాలను విస్తృతంగా ప్రచారం చేసి, ఆయనను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు