పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు

27-09-2026 | 02:52pm

నిజామాబాద్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు(Nizamabad Police Commissionerate) పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ మరియు బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిపినందుకు ప్రజలందరికి పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య(P. Sai Chaitanya) కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో  5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగింది.

ఈ  వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి, విగ్రహ గణేష్ కమిటీలు, మజీద్ కమిటీలు, అన్నిమతాల ప్రజలు ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగిందని అన్నారు. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ శుభ సందర్బంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

మరిన్ని వార్తలు