30-08-2025 08:34:20 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో గుడుంబా అక్రమ మధ్యంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ రోజురోజుకు ఎక్కడో ఒకచోట అక్రమంగా గుడుంబా ను కాస్తూనే ఉన్నారు. శనివారం బోథ్ మండలంలోని బాబేర, నిగిని, కంటిగాం గ్రామాలలో విశ్వసనీయ సమాచారం మేరకు గుడుంబా స్థావరాలపై బోథ్ పోలీసులు రైడ్ చేసి పలువురును పట్టుకున్నారు.
సబ్ ఇన్స్పెక్టర్ సాయి తెలిపిన వివరాల ప్రకారం... బాబేర గ్రామానికి చెందిన రాథోడ్ ఉత్తమ్, నిగిని గ్రామానికి చెందిన ఆడె గన్య, కంటెగాం గ్రామానికి చెందిన ఆడె దత్తు అనే వ్యక్తులు క్రమంగా గుడుంబా కలిగి ఉన్నారని వారిపై కేసులు నమోదు చేశామన్నారు. మండలంలో ఎవరైనా గుడుంబా కలిగి ఉన్న, తయారుచేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.