వినాయక ఉత్సవాలకు పోలీసుల ముందస్తు చర్యలు
మెట్ పల్లి,(విజయక్రాంతి): వినాయక నవరాత్రి ఉత్సవాలను(Nayaka Navratri celebrations) ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మెట్ పల్లి పోలీసులు(Met Pally Police) ముందస్తు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం డిఎస్పీ రాములు, సిఐ బి.సురేష్, ఎస్ఐ పి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్పర్స్, పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. వినాయక మండప నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.
అలాగే పట్టణ, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన డిజె ఆపరేటర్లు, ట్రబుల్ మాంగర్లతో పోలీస్ స్టేషన్లో సమావేశం జరిపారు. అనుమతి లేకుండా డిజె లు ఏర్పాటు చేయరాదని, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని ఆపరేటర్లకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఉత్సవాల సమయంలో గొడవలకు పాల్పడిన వారికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి కూడా కౌన్సెలింగ్ చేసి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.ఇందులో భాగంగా ముప్పై ఐదు మంది డిజె ఆపరేటర్లు మరియు ట్రబుల్ మాంగర్లను తహసీల్దార్ ఎదుట ఐదు లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.