రైతులకు పోలీసులు అవగాహన
కుబీర్ ( విజయక్రాంతి) : రహదారులపై(Roads) పంటలను ఆరబెట్టడం వల్ల జరిగే ప్రమాదాలను రైతులకు(Farmers') ముధోల్ సీఐ రవీందర్ నాయక్(Mudhol CI Ravinder Naik) వివరించారు. ప్రమాదాలపై బాసర మండలం బిద్రెల్లి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రహదారులపై సోయా పంటను ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు పంటను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.
పంటను రోడ్లపై ఆరబెట్టడం వల్ల ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సంబంధిత రైతుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తమ పంటను రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాల్లోనే ఆరబెట్టుకోవాలని సూచించారు.