వాయిదానా? ఫాయిదానా?
- డీఏ, పీఆర్సీ, బకాయి బిల్లులపై ఉద్యోగుల్లో టెన్షన్
- తెలంగాణలో ఇప్పటికే 6 డీఏలు పెండింగ్
- సుమారు 7.5 లక్షల మంది ఎదురుచూపు
- నెలాఖరుకు పీఆర్సీ నివేదిక వచ్చే ఛాన్స్ ?
- దసరాకు ఒక్క డీఏ ఇచ్చే అవకాశం
- బడ్జెట్ భారాలపై ఆర్థిక శాఖ కసరత్తు
- నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
(ఎ.చంద్రశేఖర్‌రావు) :
సంగారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు(State government employees) ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ద్వితీయ వేతన సవరణ కమిషన్(Second Pay Revision Commission) నివేదిక, కరువు భత్యం ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. పీఆర్సీ ప్రక్రియ(PRC process)ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రధాన కార్యదర్శి ద్వారా కమిషన్‌కు లేఖ రాసినప్పటికీ, తుది నివేదిక సమర్పణ, అమలుపై కాలయాపన జరుగుతుండటంతో ఉద్యోగ సంఘాల్లో అసంతృ ప్తి వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులు, భారీ వడ్డీల చెల్లింపుల కారణంగా ఆర్థిక శాఖ లెక్కింపుల్లో పడటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ లో కొత్త పీఆర్సీ, డీఏల కోసం ఎదురుచూస్తున్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 7.5 లక్షల నుండి 8 లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సుమా రు 3.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారు లు ఉన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు దా దాపు 1.2 లక్షల మంది, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు సుమారు 2.8 లక్షల నుండి 3 లక్ష ల మంది ఉండగా, కాంట్రాక్ట్, ఔట్ సోర్సిం గ్, ఇతర సిబ్బంది దాదాపు 1.5 లక్షల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభు త్వం పీఆర్సీ, డీఏలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల శ్రేణు లు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టేందుకు సి ద్ధమవుతున్నాయి. అటు ఆర్థిక సంక్షోభం, ఇటు ఉద్యోగుల ఒత్తిడి నడుమ సీఎం రేవం త్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
పీఆర్సీ జాబితాలో సస్పెన్స్
ఇటీవల పీఆర్సీ కమిటీకి ప్రభుత్వం పం పిన జాబితాలో కొత్తగా నియామకమైన డీఎస్సీ--2024 టీచర్లు, గురుకుల ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు సహా దాదాపు 70వేల నుంచి 72వేల మంది వివరాలు ప్రస్తావించకపోవడం ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 6 కరువు భత్యం కిస్తీలను పెండింగ్‌లో పెట్టిన రాష్ట్రంగా నిలిచిం ది. 2023 జూలై 1 నుంచి రావాల్సిన డీఏలతో పాటు తాజా డీఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబర్ 2023 నుండి ప్రభు త్వం ఉద్యోగులకు 5శాతం మధ్యంతర భృతి చెల్లిస్తోంది. అయితే కొత్త పీఆర్సీలో ఈ ఐఆ ర్ శాతానికి మరో 2 లేదా 3 శాతం కలిపి తుది ఫిట్మెంట్ ఖరారు చేసే యోచనలో ప్ర భుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి.
రిటైర్మెంట్ బూమ్.. అదనపు భారం
2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యా ప్తంగా 9,700 మందికి పైగా ఉద్యోగులు విరమణ పొందుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 2028 నాటికి ఈ సంఖ్య 30వేలు దాటనుంది. కొత్త పీఆర్సీ ప్రకారం వీరికి కమ్యుటేషన్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు లెక్కించి ఇవ్వాల్సి రావడంతో ఖజా నాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ప్రస్తుత 2026-- 27 ఆర్థిక సంవత్సరంలో కేవలం జూన్ నెలాఖరు నాటికే పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 7,309 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించిన రూ. 14,736 కోట్లలో దాదాపు 50 శాతానికి సమానం.
దసరా కానుకగా ఒక డీఏ?
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగు ల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఒక వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలలో ఒక డీఏను దసరా పండుగ సందర్భంగా ప్రకటించి, అక్టోబర్ నెలకు సంబంధించిన జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉంది. ఆ తర్వాతి రెండు లేదా మూడు నెలల వ్యవధిలో మరో డీఏ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మిగిలిన 4 డీఏలను కొత్త పీఆర్సీ వేతన సవరణ ప్రకటన సమయంలో అందులో విలీ నం చేయాలని ఆర్థిక శాఖ యోచిస్తోందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అలాగే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పీఆర్సీ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించే అవకాశం ఉన్నట్లు ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. ఆ తర్వాత మంత్రులు, ఉన్నతా ధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ దీనిపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలా...
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, జనా భా కలిగిన సంగారెడ్డి జిల్లాలో సుమారు 22వేల మందికి పైగా రెగ్యులర్ సిబ్బంది, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. పరిపాలనాపరంగా వేగంగా విస్తరించిన సిద్దిపేట జిల్లా పరిధిలో దాదాపు 18వేల నుండి 20వేల మంది పీఆర్సీ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుత మెదక్ జిల్లా అధికారిక సమాచారం ప్రకారం జిల్లాలో 21 రెవెన్యూ మండ లాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో దాదా పు 15వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల శ్రేణులు ఉన్నారు. ముఖ్యంగా ఉ మ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల భర్తీ అయిన డీఎస్సీ--2024 ఉపాధ్యాయులు, గురుకుల టీచర్లు, గ్రూప్-౪లో ఎంపికైన కొత్త ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుళ్లు తమకు కొత్త పీఆ ర్సీ వర్తిస్తుందా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు.
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. హామీలతో కాలయాపన చేయకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. రెండవ పీఆర్సీ నివేదికను బహిరంగపర్చి, ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించాలి. ఉద్యోగులకు క్యాష్‌లెస్ హెల్త్‌కార్డు లు వెంటనే మంజూరు చేయాలి. సీపీఎస్‌ను రద్దు చేయాలి. ఓపీఎస్‌ను పునరుద్ధ రించాలి. 72వేల మంది కొత్త ఉద్యోగులకు పీఆర్సీ వర్తించేలా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి. నేడు ఉద్యోగ సంఘాల తో జరగనున్న ప్రభుత్వ చర్చలు ఆమోదయోగ్యంగా ఉండాలని, లేదంటే పెద్దఎత్తు న ఉద్యమానికి నాంది పలుకుతాం.
టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నాయకులు మేడిశెట్టి శ్యాంరావు