పంటకు కరెంటు కష్టాలు
- అడపాదడపా విద్యుత్ కోతలు
సరఫరాలో నిరంతర అంతరాయం
ఆందోళన చెందుతున్న రైతులు
జిల్లాలో పెరిగిన డిమాండ్
కుభీర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): జిల్లాలో ఒకవైపు ఎనీలో ప్రభావం, మరోవైపు కరెంటు కోతలు రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఖరీఫ్ పంటలను (Kharif crops) సాగు చేసిన రైతులకు వర్షాకాలంలో వర్షాలు అనుకూలించలేదు. ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు బోరు బావులు కింద సేద్యం చేస్తున్న రైతులకు కరెంటు సరఫరా లో నిత్యం అంతరాయం ఏర్పడడం గంటలకు సాగునీరు పొందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా సుమారు 65 వేల వ్యవసాయ కలెక్షన్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఎన్నో ఆశలు పెంచుకొని పంటలు సాగు చేస్తే పంటలకు నీరు అందక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్
నిర్మల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ బోరుబావులు కింద సాగునీరు అందించేందుకు పడరాని పాటలు పడుతున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు గంటలకు కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో వారం రోజుల క్రితం వరకు 2 మెగాపట్ల విద్యుత్ సరఫరా డిమాండ్ ఉండగా ఇప్పుడు 100 మెగావాట్లు పెరిగి 300 కు చేరుకుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. సెప్టెంబర్ మాసంలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం చేయడం మొదటిసారి అని వారు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసిన వారి మొక్కజొన్న సోయా పత్తి పంటలకు నీటి తడులు ఇస్తున్నారు.
ప్రస్తుతం సోయా పత్తికి పూతకాతదశ ఉండడంతో ఈ సమయంలో నీళ్లు ఇస్తేనే పంటలు పండుతాయి అన్న ఉద్దేశంతో రైతులు బోర్లను వినియోగిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడడంతో ఓవర్ లోడ్ తో కరెంటు సలపరులు అంతరాయం మోటర్లు స్టార్టర్లు కాలిపోవడం విద్యుత్ సబ్స్టేషన్ లో సాంకేతిక లోపం రైతుల కారణాలు కరెంటు కోతకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో రైతులు పంటచేళ్లలోనే కరెంటు కోసం పడి కాపులు పడుతున్నారు.
వర్షాలు కూడా లోటుగా ఉండడంతో భూగర్భ జలాలు పెరగక బోరు బావుల నుంచి నీరు రావడంలేదని పరిస్థితి ఇలాగే ఉంటే పంట కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు
అప్రమత్తమైన అధికారులు
నిర్మల్ జిల్లాలో గత వారం రోజుల నుంచి వర్షాల లోటు కారణంగా వ్యవసాయ వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ షాక్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలోని కుబీర్ కుంటాల లోకేశ్వరం సోంపేట మండలాలు రైతులు కరెంటు సరఫరా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్ స్టేషన్ లకు ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు ఫోన్ చేసిన స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకున్న విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ రమేష్, డివిజనల్ ఇంజనీర్లు నాగరాజు వెంకటేశ్వర్లు జిల్లాలోని అన్ని మండలాల విద్యు శాఖ అధికారులు అప్రమత్త చేశారు. లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని కరెంటు సర్పాలలో సాంకేతిక లోపాలను వెంట వెంటనే సరిదిద్దాలని వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు అందించేందుకు అధికారులు అందరు కూడా 24 గంటలు కష్టపడి పని చేయాలని సూచించారు. కరెంట్ సరఫరా లో రైతుల ఆందోళనలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యగా పరిష్కరించుటకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
రోజుకు పదిసార్లు కరెంటు పోతుంది
రోజుకు కరెంటు పదిసార్లు పోతుంది. ఎప్పుడు వస్తది ఎప్పుడు పోతదో తెలియడం లేదు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్రస్తుతం 15 గంటలకు నుంచి రావడం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరఫరా మెరుగుపరిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది.
- సచిన్ రాథోడ్, రైతు, పార్డి కె
ఎదిగిన పంటలు ఎండిపోతున్నాయి
వాన కాలంలో వర్షాలు లేక ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం. ఉన్న పంటను బోర్ నీళ్ల సాయంతో తీసుకుందామంటే కరెంటు కోతల వల్ల పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. రోజుకు పదిసార్లు కరెంటు కోతలు విధిస్తున్నారు. భూగర్భ జలాలు తక్కువ ఉండడంతో ఓవర్లు తో మోటర్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇవ్వాలి.
- బోయిడి సురేష్, రైతు, కుభీర్
వంట చూస్తే ఏడుపొస్తుంది
మాకు పంటలే ప్రాణం. పంట పచ్చగుంటేనే మనసు బాగుంటది. వర్షాలు లేకపోవడం ఎండలు కాయడం వల్ల పంటచేల్లో ఉన్న సోయా పత్తి వాడిపోయి పూతకాత రాలిపోతుంది. వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయని పంటలు వేసుకుంటే వర్షాలు కురువకుపోగా ఉన్న పంటకు కరెంటు తిప్పలు పడుతున్నాం.
- భుజంగరావు రైతు