విమలక్క 50ఏళ్ల ప్రస్థానం
పీడీఎస్ యూ(వి) రాష్ట్ర సహాయ కార్యదర్శి బెల్లి నాగరాజు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 52వ వార్షికోత్సవం(52nd Anniversary of Arunodaya Cultural Association) సందర్భంగా ప్రజా గాయని విమలక్క(Popular singer Vimalakka) 50ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న 50గంటల ప్రజా కళాజాతరను జయప్రదం చేయాలని పీడీఎస్ యూ(విజృంభణ)రాష్ట్ర సహాయ కార్యదర్శి బెల్లి నాగరాజు కోరారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో రైతుకూలి సంఘం నాయకులు శేషరాజుపల్లి గోపి,దాసరి నాగరాజు ఆధ్వర్యంలో ప్రజా కళాజాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ... ఈనెల 26,27,28 తేదీలలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళామండపం(అరుణోదయ నాగన్న ప్రాంగణం)లో 50గంటల పాటు ప్రజా కళాజాతర అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు.విమలక్క పాడిన విప్లవ,తెలంగాణ ఉద్యమ గీతాలు,బతుకమ్మ,ఒగ్గుకథ,బుర్రకథ వంటి అనేక కళారూపాల ప్రదర్శన ఉంటుందని కవులు,కళాకారులు అభ్యుదయవాదులు,విద్యావేత్తలు,విద్యార్థులు,ప్రజాసంఘాల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మామిడి ఎల్లన్న,అశోక్,వెంకట్ రెడ్డి,అచ్యుత్,దడిపల్లి వెంకట్,నున్న మహేష్,యాదన్న,సైదులు తదితరులు పాల్గొన్నారు.