జీళ్ళచెరువులో పూజలు
అన్నదానం కార్యక్రమం ప్రారంభం
కూసుమంచి, విజయక్రాంతి:మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో బొడ్రాయి బజార్ లో శ్రీ వెంకటేశ్వర గణేష్ ఉత్సవ కమిటీ (Sri Venkateswara Ganesh Utsav Committee) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో జశ్వంత్ కుమార్, కార్యదర్శి రాజేష్ వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీడీవో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, అలాగే రేపు జీళ్ళచెరువు గ్రామ పెద్ద చెరువు వద్ద జరిగే నిమజ్జనం కార్యక్రమానికి అందరు తప్పకుండా సహాకరిస్తూ శాంతి భద్రతల మధ్య సమన్వయంతో నిమజ్జనం చేసుకోవాలని కోరారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు అంబాల వెంకటేశ్వర్లు-సత్యావతి, వినోద్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య, సభ్యులు ముద్రబోయిన వెంకటనారాయణ, వీరబాబు, సైదులు, మీరా, బెజవాడ శ్రీకాంత్, కొండా నగేష్, యాదగిరి పాల్గొన్నారు.