ట్రంప్ సంచలన నిర్ణయం.. వైట్ హౌస్‌లోకి నో ఎంట్రీ?

19-09-2026 | 06:32am

వాషింగ్టన్: స్వతంత్ర పత్రికా వ్యవస్థపై(Press System) తన తాజా హెచ్చరికలో భాగంగా వైట్ హౌస్‌లోకి ప్రవేశించకుండా CNN, MSNBC, Politico అనే మూడు ప్రముఖ వార్తా సంస్థలపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారుఈ చర్య దాదాపుగా చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయం, ఎందుకంటే ఇది అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ కింద లభించే భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ వంటి రక్షణలకు విరుద్ధంగా ఉందని భావ ప్రకటనా స్వేచ్ఛ నిపుణులు(Experts on freedom of expression) పేర్కొన్నారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందునే వేటు వేసినట్లు ట్రంప్ వెల్లడించారు. తనపై ప్రతికూల వార్తలు రాసే ఇతర మీడియా సంస్థలపైనా నిషేధాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. భవిష్యత్తులో మరిన్ని వార్తా సంస్థలపైనా వేటు తప్పదన్నారు.

సోషల్ మీడియా పోస్ట్‌లో(Social media post) ఆ మీడియా సంస్థలపై "అవాస్తవ వార్తలను (Fake news) ప్రసారం చేస్తున్నాయని" ట్రంప్ పైర్ అయ్యారు. "అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు, వారు నిరంతరం కల్పిత కథనాలను, అబద్ధాలను రాయడం లేదా ప్రసారం చేయడం జరగకూడదు" అని పేర్కొన్నారు. అలాగే, "ఇతర 'ఫేక్ న్యూస్' మీడియా సంస్థల వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాను" అని ట్రంప్ జోడించారు. ట్రంప్ పోస్ట్ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం వైట్ హౌస్‌లో ఆ మూడు సంస్థల ప్రతినిధులు పనిచేయడం కనిపించింది. శనివారం నుండి ఆ ముగ్గురినీ వైట్ హౌస్ ప్రాంగణంలోకి రాకుండా నిషేధిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.



మరిన్ని వార్తలు