ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం డెవలప్మెంట్ మీటింగ్
మూడు సంవత్సరాలుగా నిధులు లేకపోవడంతో ఎలాంటి తీర్మానాలు చేయలేదు
నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం(Primary Health Centre)లో డాక్టర్ సృజన్ కుమార్(Srujan Kumar) ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం డెవలప్మెంట్ మీటింగ్(Primary Health Centre Development Meeting) నిర్వహించడం జరిగింది.ఈయొక్క మీటింగ్లో కమిటీ సభ్యులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు(Medical Services) అందించాలని సూచించడం జరిగింది.మండల స్పెషల్ ఆఫీసర్,డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ...ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం సిబ్బంది,మండలంలోని సర్పంచులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అందుకోసం త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు త్వరలో నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.అయితే నాగిరెడ్డిపేట మండల(Nagireddypet Mandal) ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో గత మూడు సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు లేకపోవడంతో తీర్మానాలు అనేవి ఏమి చేయలేదని డాక్టర్ సృజన్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సృజన్ కుమార్, గోపాల్పేట్,నాగిరెడ్డిపేట,గోలి లింగాల గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మన్నే వెంకటి,బురకాయల రోజా,ఎంపీడీవో గంగాధర్, ఇన్చార్జి తాసిల్దార్ వెంకట్ రెడ్డి, సూపర్వైజర్ సునంద, సుభాషిని,అనిల్,డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.