ఆర్టిస్టుల కన్నా దర్శకులకే ప్రాధాన్యం ఇవ్వాలి
ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) హీరోగా ఆర్కా మీడియా వర్క్స్(Arka Media Works), షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై(Showbiz banners) శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం కథానాయకుడు ఫహాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలివీ..
కార్తికేయ నాకు ఫోన్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. అందుకే ఈ సినిమాని ఎలా అయినా సరే చేయాలని ఫిక్స్ అయ్యాను.
ఈ చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యాజిక్ కూడా ఒక అంశం. ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలా మందికి చాలా విషయాల్ని అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది.
మలయాళంలో కథను అర్థం చేసుకుని, డైలాగ్స్ నేర్చుకుని.. ఇంగ్లీష్‌లోకి మార్చుకుని.. తెలుగులో నటించడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. కాస్త కష్టంగానే అనిపించినా ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది.
ఆర్టిస్టుల కంటే రచయిత, దర్శకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నది నా అభిప్రాయం. శశాంక్ ఈ మూవీకి రైటర్, డైరెక్టర్. కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీ వల్లే మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లింది.
నేను చేసే ప్రతీ పనిలో నా బెస్ట్ ఇవ్వాలని, నా వర్క్ పట్ల నేను నిజాయతీగా ఉండాలనుకుంటాను. ఈ సినిమాలోని నా పాత్ర జర్నీ కొత్తగా ఉంటుంది. చెడు నుంచి మంచిగా మారే ఆ జర్నీ అందరికీ నచ్చుతుంది. నేను గత ఏడాదిన్నరగా ఇక్కడే ఉంటున్నా. తెలుగు కొంచెం కొంచెం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్రకు నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టైటిల్ బాలకృష్ణ సినిమాలోని డైలాగ్. ఈ సినిమా కోసం టైటిల్ పెట్టే క్రమంలో ఆయనను కలిశాం. మా సినిమాలోని కొన్ని సీన్స్ చూపించాం. ఆయన చాలా ఎంజాయ్ చేశారు.