25 August, 2026 | 2:12 AM

ఘనంగా ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’

25-08-2026 01:44 AM

విజేతలకు బహుమతులు ప్రధానం

మల్కాజిగిరి, ఆగస్టు 24 (విజయక్రాంతి): స్టూడియో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మల్కాజిగిరి వారి ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజిగిరి వారి సహకారంతో సోమవారం ’వరల్ ఫోటోగ్రఫీ డే’ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోటో కాంటెస్ట్ నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అశోక్ కుమార్ స్త్వ్రన్, మల్కాజిగిరి ప్రెసిడెంట్ లయన్ షకీల్ అహ్మద్, వారి సహచరులు, స్టూడియో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మల్కాజిగిరి అధ్యక్షులు రాములు, బాల్ నర్సయ్య, కార్యవర్గం పాల్గొన్నారు.

ఫోటో కాంటెస్ట్ లో ప్రధమ బహుమతిని భవాని ఫోటో స్టూడియో, ద్వితీయ బహుమతి ఓంకార్ డిజిటల్ స్టూడియో, తృతీయ బహుమతి మధు ఫోటోస్టూడియో వారికి లభించింది. ఈ సందర్భంగా వారిని సత్కరించి, అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీనియర్ ఫోటోగ్రాఫర్స్, అలాగే మల్కాజిగిరి పరిధిలోని పలు స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అందరిని కూడా సన్మానించారు.