ముగ్గురు హైకోర్టు సీజేలకు పదోన్నతి

29-09-2026 | 05:15am
  1. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలి
  2. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
  3. తెలంగాణ సీజే అపరేష్‌కుమార్‌సింగ్‌కు ప్రమోషన్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను(Chief Justices of the High Court) సుప్రీంకోర్టు జడ్జీలుగా(Supreme Court Judges) పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) సోమవారం సిఫార్సు చే సింది. సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్మానం ప్ర కారం.. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌ను, ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్లుగా పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది.

ఈ మేరకు సో మవారం జరిగిన కొలీజి యం సమావేశంలో ఈ సి ఫార్సు చేశారు. సీజేఐతో పాటు, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బీవీ నాగారత్న, జస్టిస్ ఎంఎం. సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియంలో స భ్యులుగా ఉన్నారు. సుప్రీం కోర్టుకు న్యాయమూర్తుల నియామకం కోసం నిర్దేశించిన వి ధానం ప్రకారం.. ఇప్పుడు కొలీజియం సిఫార్సును పరిశీలించనున్నారు.

ఈ ముగ్గురి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ నిర్ణయం దేశంలోని న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం, న్యా యమూర్తుల ఎంపికలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ సిఫారసులు న్యాయ వ్యవస్థ నాణ్యతను పెంపొందించడానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు