నూతన కోర్టులతో సత్వర న్యాయ సేవలు

27-09-2026 | 05:05am

తెలంగాణ హైకోర్టు జడ్జి మౌషుమి భట్టాచార్య

ఎల్బీనగర్, సెప్టెంబర్ 26 : నూతన కో ర్టులు ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందుతాయని, కోర్టులు న్యాయ పరిరక్షణలో మరింత కీలకపాత్ర పోషించాలని తె లంగాణ హైకోర్టు జడ్జి మౌషుమి భట్టాచార్య(Telangana High Court Judge Moushumi Bhattacharya) పేర్కొన్నారు. హయత్ నగర్ లోని వస్ఫరికాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ, 3వ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను తెలంగాణ హైకోర్టు జడ్జి, రంగారెడ్డి జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేషన్ జడ్జి నందికొండ నర్సింహారావుతో కలిసి తెలంగాణ హైకోర్టు జడ్జి హౌషుమి భట్టాచార్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హయత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ, 3వ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు.

నూతన కోర్టులతో ఈ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మరో రెండు వారాల్లో దసరా, దీపావళి పండుగల సెలవులు రానున్న నేపథ్యంలో హయత్ నగర్ లో నూతన కోర్టులను అలస్యం చేయకుం డా ప్రారంభించామన్నారు. దీంతో న్యాయం కోసం ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుందని, న్యాయవా దులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బందికి కూడా తమ విధులను మరింత స మర్థవంతంగా నిర్వహించేందుకు సహాయపడుతుందని వివరించారు.

న్యాయస్థానాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడం అందరిదీ బాధ్యత అని సూ చించారు. ప్రతిఒక్కరికీ సమానంగా, నిష్పక్షపాతంగా, త్వరితగతిన న్యాయం అందేలా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టు జడ్జి ఎ. కర్ణ కుమార్, హయతనగర్ కోర్టుల జడ్జీలు సిరిసిల్ల ప్రి యాంక, పర్వీన్ బేగం, ఎల్బీనగర్ జోన్ డీసీ పీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ చింత శంకరయ్య, హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.లింగంగౌడ్, జనరల్ సెక్రటరీ ఎ.రామ్మోహన్, న్యాయవాదులు ముఖేష్ దుబే, జి.భార్గవి, సుమలత, స్పోరట్స్ సెక్రట రీ శివకుమార్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు