రైతుల కష్టాలకు.. కరెంట్ షాక్‌కు చెక్!

10-09-2026 | 05:15am
  1. 25 మోటర్ల భారంతో ఐదేళ్లుగా ట్రిప్పింగ్..

రైతుల విజ్ఞప్తికి విద్యుత్ శాఖ తక్షణ స్పందన

100 కేవీ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో సమస్య పరిష్కారానికి వేగం

ఏడీఈ పి. వెంకట్ చొరవ.. 

జేఎల్‌ఎం బాలాజీ కృషికి రైతుల అభినందనలు

కూసుమంచి, సెప్టెంబర్ 9 : రైతుల సమస్యపై విద్యుత్ శాఖ (Electricity Department)అధికారులు తక్షణమే స్పందించడంతో కూసుమంచి మండల కేంద్రంలోని వ్యవసాయ రైతులకు ఊరట లభించింది. ఐదేళ్లుగా రైతులను వేధిస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి 100 కేవీ సామర్థ్యం కలిగిన కొత్త ట్రాన్స్ఫార్మర్తో పాటు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ను ఏర్పాటు చేశారు.

25 మోటర్ల భారంతో నిత్యం ఇబ్బందులు

మండల కేంద్రంలోని నెల్లూరి చిన్న బసవయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మ్ప సుమారు 25 వ్యవసాయ మోటర్ల భారం ఉండటంతో తరచూ విద్యుత్ ట్రిప్పింగ్, ఫ్యూజులు కొట్టేయడం, అధిక లోడ్తో ట్రాన్స్ఫార్మ్ప ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యేవి. దీంతో రైతులు పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చెరువుల్లో నీటి లభ్యత కూడా అంతంతమాత్రంగా ఉండటంతో బోర్లపై ఆధారపడుతున్న రైతులకు విద్యుత్ సరఫరా అత్యంత కీలకంగా మారింది. ఈ సమయంలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలను కాపాడుకోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

*సమస్యను మంత్రి దృష్టికి.. అధికారుల తక్షణ స్పందన

రైతులు తమ ఇబ్బందులను జేఎల్‌ఎం బాలాజీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ ఏడీఈ పి. వెంకట్, ఏఈ అబ్దుల్ ఖాదీర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను వివరిస్తూ కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్తో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో విద్యుత్ శాఖ అధికారులు కూడా సమస్యను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని తక్షణ చర్యలకు ఉపక్రమించారు.

రైతుల సాగుకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో 100 కేవీ సామర్థ్యం కలిగిన కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ను మంజూరు చేశారు. దీంతో ఐదేళ్లుగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో మిగిలిన రైతులపై కూడా విద్యుత్ లోడ్ భారం తగ్గే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు