రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు రిషిక ఎంపిక

01-10-2026 | 09:50pm

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం జెడ్పీహెచ్‌ఎస్‌(Dharmaram ZPHS)కు చెందిన విద్యార్థిని ఆర్. రిషిక సబ్‌జూనియర్ (అండర్–16) కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన రిషికను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు రాజన్న సిరిసిల్ల కబడ్డీ అసోసియేషన్(Rajanna Sircilla Kabaddi Association) అధ్యక్షులు ముస్కు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారపు తిరుపతి తెలిపారు.

ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు వేములవాడ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న 36వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ పోటీల్లో రిషిక పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయురాలు ముడికే రేణుక తెలిపారు. రిషిక రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయులు, ఏఏపీసీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు రాణించే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు