వినాయక వేడుకల్లో పిల్లుట్ల రఘు

16-09-2026 | 08:19pm

* ఆరేళ్లుగా విగ్రహాల పంపిణీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

* గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

గరిడేపల్లి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): వినాయక చవితిని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ నాయకుడు పిల్లుట్ల రఘు(BRS Huzurnagar constituency leader Pillutla Raghu) గరిడేపల్లి మండలంలోని కాచవారిగూడెం, కాల్వపల్లి, రాయినిగూడెం, కీతవారిగూడెం, అప్పన్నపేట, అబ్బిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, సర్వారం గ్రామాల్లో పర్యటించారు.

ఆయా గ్రామాల్లో వినాయక విగ్రహాలను అందజేసి, మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో సుమారు 400 విగ్రహాలను అందించినట్లు తెలిపారు.

పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్నానన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు.కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు కృష్ణానాయక్‌, శంబిరెడ్డి, మన్నెం వేణుయాదవ్‌, కర్నాటి నాగిరెడ్డి, మేళ్లచెరువు వెంకటరమణ, ఉప సర్పంచులు, స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు