కాట కల్సిన కాలం

08-09-2026 | 05:05am
  1. తెలంగాణలో వర్షాభావం మరింత త్రీవం
  2. 358 మండలాల్లో తీవ్రంగా పరిస్థితులు
  3. 15 మండలాల్లో మరీ దుర్భిక్ష ఛాయలు
  4. 60 శాతం మేర వర్షపాతం తక్కువే
  5. ఆగస్టులోనూ మొహం చాటేసిన మేఘాలు
  6. దుర్భిక్షపు ఛాయల్లోకి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఎల్‌నినో(El Nino).. మెల్లమెల్లగా తన కోరలను చాపుతోంది. తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. వాతావరణాన్ని శాసిస్తోంది. వెరసీ.. ప్రజలు, పంటలకు ప్రాణాధారమైన వర్షపాతం మొహం చాటేస్తోంది. ఆగస్టులో ఏమైనా తుఫానులు రాకపోతాయా.. వర్షం కరువు తీరక పోతుందా అని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయ్యింది.

చెదురుమదురు స్వల్ప జల్లులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం ప్రభావం ఏమీ కనపడటం లేదు. దీనితో మెల్లమెల్లగా రాష్ట్రంలో కరువు ఛాయలు కనపడుతున్నా యి. ఇప్పటికే 15 మండలాల్లో 60 నుంచి 99 శాతం వరకు సాధారణ వర్షపాతం లోటుగా ఉండటాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. రాష్ట్రంలోని మొత్తం 358 మండలాలు సాధారణ వర్షపాతం కంటే.. 20 నుంచి 59 శాతం లోటు నమోదు కావడంతో.. వచ్చే నెలలోపు అవికూడా తీవ్ర వర్షపాతం లోటు జాబితాలో చేరే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు..

ఈ యేడు వర్షకాలం ప్రారంభంలోనే ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా ఉంటుందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయంతో పాటు.. అన్ని శాఖలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరువును ఎదుర్కొనేలా కాంటిజెన్సీ ప్రణాళికలనుకూడా వ్యవసాయ శాఖ రచించి అమలు చేస్తోంది. జూలై నెలలో ఒకింత ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఆగస్టులో ఏదైనా అద్భుతం జరక్కపోతుందా.. బంగాళాఖాతంలో ఏదైనా తుఫానులు ఏర్పడి.. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉండకపోతుందా అని అందరూ ఆశించారు.

అయితే.. ఆగస్టు మాసంతో పాటు.. సెప్టెంబర్ మొదటి వారం ముగిసినా.. వర్షం కదలికలు కనుచూపుమేరలో కనపడటం లేదు. దీని ప్ర భావం రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతోంది. ఈయేడు వర్షకాలం ప్రారంభం అయిన.. జూన్ 1 నుంచి మొదలుకుని.. సెప్టెంబర్ 7 వరకు రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని గమనిస్తే.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల దిశగా సాగు తున్నట్టుగా సంకేతాలు కనపడుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం (7వ తారీఖు) నా టికి రాష్ట్ర సాధారణ వర్షపాతం 620.1 మి. మీటర్లు.

అయితే ఇందులో కురిసిన వర్షం మాత్రం కేవలం 483.4 మి. మీటర్లే. అంటే 22 శాతం వర్షపాతం లోటుగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మొత్తం 20 జిల్లాల్లో లోటు వర్షపాతం కనపడుతోంది. 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యింది. ఇక మండలాల వారీగా చూసుకుంటే.. ఇప్పటికే 15 మండలాలు 60 నుంచి 99 శాతం లోటు వర్షపాతంతో ఉన్నాయి. అంటే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయనే చెప్పవచ్చు. అలాగే 358 మండలాల్లో లోటు వర్షపాతం (20 నుంచి 59 శాతం వరకు) లోటు వర్షపాతం నమోదయ్యింది. సాధారణ వర్షపాతం, అం తకం టే ఎక్కువ నమోదైన మండలాలు కేవ లం 32 మండలాలు మాత్రమే ఉన్నాయి.

వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాలు..

రాష్ట్రంలో వర్షపాతాన్ని పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో తీవ్రంగా వర్షపాతం లోటు ఉన్నట్టుగా చెప్పవచ్చు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మం జి ల్లా పరిధిలో (ఖమ్మం 37 శాతం, భద్రాద్రి లో 38 శాతం) 37.5 శాతం లోటు వర్షపాతం నెలకొంది. అలాగే హన్మకొండ జిల్లా పరిధిలో 48 శాతం వర్షపాతం లోటు, వరంగల్ జిల్లా పరిధిలో 47 శాతం లోటు, మహ బూబాబాద్ జిల్లాలో 34 శాతం లోటు, భూ పాలపల్లి జిల్లాలో 17 శాతం లోటు, జనగామ జిల్లాలో 44 శాతం లోటుతోపాటు.. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షపాతం కురిసే జిల్లాల్లో ఒకటైన ములుగు జిల్లాలో ఇప్పటికీ 18 శాతం లోటు వర్షపాతం నమోదవ్వడం గమనార్హం. ఈ లెక్క ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 35 శాతం లోటు వర్ష పాతం నెలకొన్నట్టే.

అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిస్థితికూడా అలాగే ఉం ది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 35 శాతం లోటు వర్షపాతం ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహ బూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు దుర్భిక్ష ప్రభా వం ఉన్న జాబితాలో ముందు వరుసలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో మొ త్తం 621 మండలాలు ఉండగా.. ఇందులో 390 మండలాల్లో ఈ సెప్టెంబర్ మొదటి వారంలో చుక్క వర్షం కురవలేదు. అలాగే 73 మండలాల్లో అతి స్వల్పంగా వర్షంచినుకులు కురవగా.. మరో 110 మండలాల్లో చిరు జల్లులు కురిశాయి. అలాగే 48 మండలాల్లో మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసి ందంటే ఎల్‌నినో ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది.

సెప్టెంబర్‌లోనైనా..

ఇప్పటికే రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఒక్కటికూడా పూర్తిగా నిండలేదు. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరిలకు వరద లేదు. వాగులు, వంకల్లోనూ నీ రు కానరావడం లేదు. పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. కనీ సం ఈ సెప్టెంబర్‌లోనైనా వర్షాలు కు రవకపోతే.. పంటలు కాపాడుకోవడం చాలా కష్టమని రైతాంగం వాపోతోంది. నిజానికి అక్టోబర్, నవంబర్‌లో బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫానులు, అల్పపీడన ద్రోణులు ఏర్పడతా యి. సెప్టెంబర్‌లో తుఫానులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు చాలా త క్కువగా ఉంటాయి.

ఎందుకంటే.. ఇది నైరుతి రుతుపవనాలు బలహీనపడే సమయం. ఈ నెలలో రాష్ట్ర సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. మాత్రమే. జూలై, ఆగస్టుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. కానీ జూలై, ఆగస్టులోనే తక్కువ వర్షపాతం నమోదైతే.. ఇక సెప్టెంబర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉం టాయో .. చెప్పకనే చెప్పవచ్చు. అంటే సెప్టెంబర్‌లోనూ సాధారణ వర్షపాతంలో 60 నుంచి 99 శాతం లోటు వర్షపాతమే నమోదైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా క్షామ పరిస్థితులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం ఈ దశగా ఆలోచించి.. ము ందస్తుగా చర్యలు తీసుకోవలని ప్రజ లు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు