రోలర్ స్కేటింగ్‌లో రెయిన్‌బో విద్యార్థుల ప్రతిభ
11-09-2026 | 08:55am
వనపర్తి టౌన్: హైదరాబాద్‌లో ఈ నెల 5న నిర్వహించిన ఇంటర్ స్కూల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్, వనపర్తి విద్యార్థులు ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించారు. పలువురు విద్యార్థులు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీత విద్యార్థులను అభినందించి మెమెంటోలు, కప్ అందజేశారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.