27 August, 2026 | 7:59 PM

గుండంపల్లిలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

27-08-2026 06:57 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గురువారం స్థానిక ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రక్షాబంధన్ పండుగ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టతను చాటిచెప్పారు.అనంతరం గ్రామసభలో గ్రామ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.