రవీందర్ సింగ్ రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉండాలి
బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముకరంపుర, సెప్టెంబర్7(విజయక్రాంతి): కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తేవలేదంటూ మాజీ మేయర్, బీఆర్‌ఎస్ నేత రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ యన రాజకీయ అజ్ఞానానికి, దివాలాకోరుతనానికి నిదర్శనమని, బి ఆర్ ఎస్ పార్టీకి ప్ర జలు వీఆర్‌ఎస్ ఇచ్చిన ఆ పార్టీ నేతలకు ఇం కా బుద్ధి రావడం లేదని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మండిపడ్డారు.
సోమవారం పార్లమెంట్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రవీందర్ సింగ్ విసిరిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని, బండి సంజయ్ కృషితోనే కరీంనగ ర్కు వేల కోట్ల నిధులు వచ్చాయని లెక్కలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. రవీందర్ సింగ్ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని , బండి సంజయ్ కుమా ర్ తీసుకువచ్చిన నిధుల విషయం తేలిన తర్వాత రవీందర్ సింగ్ రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బల్దియాను ఉద్ధరించిందేమీ లేకపోవడంతోనే నగర ప్రజలు ఆ పార్టీని సింగిల్ డిజిట్కు పరిమితం చేశారని ప్రవీణ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, బీజేపీపై ఉన్న విశ్వాసంతోనే నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందని తెలిపారు. మేయర్ కోలగాని శ్రీనివాస్‌పై రవీందర్ సింగ్ చేసిన అ నుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రం గా ఖండించారు. మేయర్ కోలగాని శ్రీనివాస్ అధికారంలోకి ఆరు నెలల లోపే ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, బండ రమణారెడ్డి, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, కొలిపాక శ్రీనివాస్ దేవసాని సరస్వతి సత్యనారాయణ, జాడి బాల్రెడ్డి, తోట అనిల్, వంగల రవి గోపాల్, కేఏ పీపీ చంద్ర, అప్పాల శ్రీనివాస్, దయ్యాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు
