వాడపల్లి వద్ద నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీవో
16-09-2026 | 08:37pm
దామరచర్ల సెప్టెంబర్ 16: గణేష్ ఉత్సవాలలో బాగంగా దామరచెర్ల మండలం వాడపల్లి కృష్ణా నది వంతెన వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమజ్జనం(Immersion Arrangements) కేంద్రాన్ని మిర్యాలగూడ ఆర్డీవో రమణా రెడ్డి(RDO Ramana Reddy) బుధవారం పరిశీలించారు. నిమజ్జనం కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాలు, రద్దీ నియంత్రణ, శుభ్రత ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించారు.
సంబంధిత అధికారులందరికి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మండలం నర్సాపురం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను పరిశీలించారు. రీ-సర్వే పనుల పురోగతిని సమీక్షించి, సకాలంలో, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దామరచెర్ల తహశీల్దార్ జవహర్ లాల్, ఎస్ఐ సైదులు ,ఆర్ అండ్ బి ,విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.