10న చలో హైదరాబాద్ యథాతథం
- ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి సీఎం గారూ!
- మీరిచ్చిన వాగ్దానాలకే దిక్కు లేకపోతే ఎలా?
- సభకు అనుమతి ఎందుకివ్వరు? మేం అరాచక శక్తులమా?
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఉద్యోగ(Employees), ఉపాధ్యాయ(teachers), కార్మిక(workers), పెన్షనర్ల(pensioners) డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఉద్యోగుల సభను యథావిధిగా నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగలు జేఏసీ(Telangana Employees JAC) స్పష్టంచేసింది. ‘మీరిచ్చిన హామీలే అమలు(Promises Implemented) చేయమంటున్నాం, కొత్తగా మేమేమి అడగడం లేదు’ అని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్(Maram Jagadeeshwar) పేర్కొన్నారు.
సోమవారం టీఎన్జీవో భవన్(TNGO Bhavan)లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశం ఆయనతోపాటు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు(Eluri Srinivas Rao) ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం విచారకరమని అన్నారు. దీంతో ఉద్యోగ జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపును యథావిధిగా కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.
నిరసన తెలిపే హక్కు ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు ఉందని అన్నారు. తాము కార్యాచరణను ప్రకటించినప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రకటించలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలను వారే నెరవేర్చకుంటే ఉద్యోగులుగా తాము ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రెండేళ్లు ఆగాలని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ.. ఇప్పటికే రెండున్నరేళ్లు వేచి చూశామని పేర్కొన్నారు. ఇంకా రెండేళ్లు ఆగితే మరో పీఆర్సీ సమయం కూడా వస్తుందని అన్నారు. ఇక తాము ఆగేది లేదన్ని స్పష్టం చేశారు.
చలో హైదరాబాద్ సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లవుతుందని, ఆరు డీఏలు పెం డింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితి ఏరాష్ట్రంలో లేదన్నారు. అడుగుదామంటే వినే పరిస్థితిలేదని తెలిపారు. మావి గొంతెమ్మ కోర్కెలు కావని, గత ప్రభుత్వమే ఐఆర్ ప్రకటించిందని, ఒకటో తేదీన జీతాలు ఇవ్వడాన్ని పదే పదే గొప్పగా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు అనుమతి ఎందుకివ్వరు?
ప్రతిపక్షం, పాలకపక్షం వారే ధర్నాలు చేస్తున్నప్పుడు, ఉద్యోగులమైన తమకు నిరసన తెలిపేందుకు అనుమతి ఎందుకివ్వరని మారం జగదీశ్వర్ ప్రశ్నించారు. తామేమై నా అరాచక శక్తులమా అని నిలదీశారు. తాము గాంధే య మార్గంలో నిరసన తెలుపుతామని, పోలీసు శాఖ స భ నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరారు. చలో హైదరాబాద్ సభను కచ్చితంగా నిర్వహిస్తామని, సభ ముగిసిన తర్వాత నిరసన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
అన్ని సంఘాల రాష్ట్ర, జిల్లా, మం డల బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌ర్సింగ్ ఉ ద్యోగులను పెద్ద సంఖ్యలో సమీకరించి హైదరాబాద్‌కు తరలించాలని కోరారు. ఇదిలా ఉండగా, చలో హైదరాబాద్ కార్యక్రమానికి మరో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్ర టరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ కార్యాలయానికి వచ్చి సంపూర్ణ మద్దతు తెలిపారు. సమావేశంలో జేఏసీ నా యకులు పుల్గం దామోదర్ రెడ్డి, ముజీబ్ హుస్సేని, బి.శ్యామ్, మధుసూదన్ రెడ్డి, సదానందం గౌడ్, వెంకట్, కటకం రమేష్, కస్తూరి వెంకటేశ్, ఎం.అంజిరెడ్డి, లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
