పరిసరాల పరిశుభ్రతే... ఆరోగ్యానికి శ్రీరామరక్ష
మాజీ కార్పొరేటర్ బాబు చొరవతో చెత్తకుప్పల తొలగింపు
పరిశుభ్రంగా మారిన మహాంకాళమ్మ గుడి పరిసరాలు
జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని శ్రీ మంకాలమ్మ దేవాలయం(Sri Mankalamma Temple) వద్ద గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్తకుప్పలను స్థానిక బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు చొరవతో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పూర్తిస్థాయిలో శుభ్రం చేశారు. భక్తులు స్థానికులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గమనించిన పానుగంటి బాబు తక్షణమే స్పందించి, పారిశుద్ధ్య సిబ్బందిని అక్కడికి పిలిపించారు. స్వయంగా దగ్గరుండిచెత్తకుప్పలను తొలగించి, ఆ ప్రాంతమంతా క్రిమిసంహారకాలతో శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఆలయ పరిసరాలు తిరిగి స్వచ్ఛంగా మారడంతో స్థానిక ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వెంటనే స్పందించిన మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబుకు, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు పరిసర ప్రాంత వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆలయ పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.