అవార్డు అందుకున్న రిటైర్డ్ హెచ్‎ఎం

28-09-2026 | 01:33pm

మహబూబాబాద్, (విజయక్రాంతి): మెగా హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ మెగా ఈవెంట్స్(Mega Helping Hands and Mega Events) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం విద్య, సాహితీ, సాంస్కృతిక, నృత్యం, జర్నలిజం రంగాలలో  కృషి చేస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి స్వర్ణ నంది అవార్డులు(Swarna Nandi Awards), కీర్తి ఐకాన్ అవార్డులు ప్రధానం చేస్తుంటారు. ఈ సంవత్సరము మహబూబాబాద్ జిల్లాకు చెంది విద్య, సాహితీ రంగాలలో కృషి చేస్తున్న రిటైర్డ్ హెచ్ ఎం సమ్మెట వెంకటేశ్వర్లు ను ఎంపికచేసింది. బిర్లా ఆడిటోరియం, కూకట్ పల్లి, హైదరాబాద్ నందు స్వర్ణ నంది అవార్డు ప్రధానం చేశారు. సినీ నటులు గౌతం రాజు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ పీ.రామక్రిష్ణ గౌడ్, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.ఎం రత్న, విశ్వక్ మూవీ డైరెక్టర్ వేణు, జాతీయ కబడ్డీ క్రీడాకారిణి, సినీ యాక్టర్ జ్యోత్స్న, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ టీవీ ఆర్టిస్ట్ శిరీషరెడ్డి చేతుల మీదుగా  ఈ అవార్డును అందచేశారు.

మరిన్ని వార్తలు