రేవంత్‌కు భయం పట్టుకుంది

23-04-2024 01:48:38 AM

l అధికారం పోతుందనే కోమటిరెడ్డితో స్నేహం

l ప్రజలు నమ్మడం లేదనే దేవుళ్లపై ప్రమాణం

l బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆగస్టు సంక్షోభంలో పదవి పోతుందనే భయంతోనే తన తర్వాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఆయన పదవికి గండం ఉందని ఏలేటి తెలిపారు. మరోవై పు రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మ డంలేదని, అందుకే దేవుళ్లపై ప్రమా ణం చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ వెళితే జోగులాంబపై, యాదాద్రిలో నర్సింహ స్వామిపై, మరోచోట రామునిపై ఒట్టేస్తున్నారని, రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తామంటున్నా రని చెప్పారు.

రుణమాఫీ వరకు ఒట్టేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మిగతా హామీలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 100 రోజులు గడిచినా గ్యారెంటీలు, హామీ లను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కౌలు రైతులు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న హామీల విలువ రూ.లక్ష కోట్లు దాటుతుందన్నారు. ఈ నిధులను ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. రైతులకే రూ. లక్ష కోట్ల హామీల భారం ఉంటే... పింఛన్లు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, కల్యాణలక్ష్మి బదులుగా ఇస్తామన్న రూ. 1 లక్ష, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగు లకు రూ. 5 లక్షలు తదితర అనేక గ్యారెంటీలకు ఎంత ఖర్చవుతుందో ఊహించవచ్చని తెలిపారు. అందుకే ఆగస్టు15 వరకు తాను పదవి లో ఉంటానో లేనో అని రేవంత్ రెడ్డి.... అప్పటికి వాయిదా వేస్తూ వస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.

జూన్ 6న ముగిసే కోడ్ కోసం పథకాల అమ లుకు ఆగస్టు 15వరకు వాయిదా వేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకునాలన్నారు. ఇచ్చిన హామీ లన్నీ ఆగస్టు 15లోపు అమలు చేయకుంటే తన వల్ల కావడం లేదని సీఎం పదవికి రాజీనామా చేయాలని సీఎంకు రాసిన  బహిరంగ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచి అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, తడిచిన ధాన్యం కూడా బోనస్ ఇచ్చి కొంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు స్పందించాలని అన్నారు. తనతో ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్తున్న రేవంత్ రెడ్డి వెంట ఎవరూ టచ్‌లో లేరని ఆయనే వేరే వారితో టచ్‌లోకి పోయినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొందని మహేశ్వర్ రెడ్డి అన్నారు.