కేసీఆర్ పాలనకు మించి రేవంత్ అరాచకం

08-09-2026 | 05:10am

బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కేసీఆర్ పాలనను మించిపోయిన రేవంత్ అరాచకం ఉందని, ఇదేం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి? అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో 40 లక్షల మం ది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, వివాదాస్పద 22ఏ జాబితాను రద్దు చేయాలనే డిమాండ్‌తో అసెంబ్లీ ముట్టడికి నడుం బిగించిన బీజేపీ శ్రేణులపై పోలీసుల చర్యలను  ఖండిస్తున్నామన్నారు. 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును అసెంబ్లీ వద్ద పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసుల తోపులాటలో తమ పార్టీ నాయ కురాలు, అధికార ప్రతినిధులు గాయపడటం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. గతంలో కేసీఆ ర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పోలీసులను అడ్డం పెట్టుకుని అహంకారంతో పాలించిందో, నేడు రేవంత్ సర్కార్ కూడా అంతకుమించి అరాచకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

అక్రమ అరెస్టులతో, పోలీసుల నిర్బంధాలతో మా గొంతును నొక్కలేరనొ హెచ్చరించారు. వెంటనే 22ఏ భూ దందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు