‘జార్జ్ క్రిష్’తో రొమాన్స్
చార్మింగ్ స్టార్ శర్వానంద్(Charming Star Sharwanand), దర్శకుడు శ్రీను వైట కాంబోలో తెరకెక్కుతున్న పండుగ బొమ్మ ‘జార్జ్ క్రిష్(George Krish)’. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గతంలో విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వానంద్ హీరోయిన్‌ను ఎత్తుకున్న సిల్హౌట్ ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ బూస్టర్‌ను గురువారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
అంతేకాక ఈ సినిమాలో మానస వారణాసి(Manasa Varanasi) హీరోయిన్‌గా నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’తో సూపర్ హిట్ అందుకున్న మానస.. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా కనిపించనుంది. టైటిల్ పోస్టర్‌ను బట్టి సినిమాలో ప్రేమకథకు కీలక ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: కేవీ గుహన్; సంగీతం: అనూప్ రూబెన్స్; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా; ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల.