ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
18-09-2026 | 02:23pm
ఇటీవల సస్పెండ్ కు గురైన డ్రైవర్
మనోవేదనతో ఆత్మహత్య
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో ఆర్టీసీ డ్రైవర్(RTC driver) సాయిలు ఆత్మహత్య కు పాల్పడ్డారు. కామారెడ్డి డిపో(Kamareddy Depot)లో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయిలు ఇటీవల సస్పెండ్ కు గురయ్యారు. దీంతో ఇంటి వద్ద ఉంటూ మనోవేదన చెందిన సాయిలు కామారెడ్డిలో ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే సస్పెండ్ చేసినట్లు తెలిపారు.