ఇది గొంతు పిసికే పాలన

08-09-2026 | 04:50am
  1. సీఎం రేవంత్‌రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు
  2. పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా ప్రవర్తన
  3. కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తే.. పీక నొక్కుతారా?
  4. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి
  5. రాష్ట్రంలో దుశ్యాసన పర్వం: సునీతాలక్ష్మారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు.. ఇది గొంతు పిసికే పాలన అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Former Minister Sabitha Indra Reddy) విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళలంటే గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తే..పీకనొక్కుతారా? పోలీసుల ముసుగులో కొంద రు గూండాల్లా ప్రవర్తించారా అనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో ‘దుశ్యాసన పర్వం’ కొనసాగుతోందని, అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి(former Minister Sunitha Laxma Reddy) విమర్శించారు. ఇది ‘శాసనసభనా.. లేక రౌ డీ రాజ్యమా?‘ అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ గేటు వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనపై బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో కలిసి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లకుండా తమను గేటు వద్దే పోలీసు లు అడ్డుకున్నారని తెలిపారు. తమ ఎ మ్మెల్యేలు ధరించిన నల్ల టీషర్టులపై అభ్యంతరకరమైన పదాలు ఏమీ లేవని, వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే వా టిపై రాశామని చెప్పారు. తమను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్ర శ్నించారు. ‘నా గొంతు పట్టుకుని, జుట్టు పట్టుకుని లాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పట్టుకుని లాగారని, కేటీఆర్ లేకపోతే తమను కిందపడేసి తొక్కే వారని చెప్పారు. సీఎంని సంతృప్తి పరిచేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిం చారని ఆరోపించారు. మహిళా మంత్రి సీతక్క ఈ ఘటనను ఖండించాల్సింది పోయి ‘డ్రామా’ అంటూ మాట్లా డటం సరికాదన్నారు. జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు : సునీతాలక్ష్మారెడ్డి

మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని, ఇదొక చీకటి రోజు అని వ్యాఖ్యానిం చారు. మ హిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు తమ గొంతులు నొ క్కారని ఆరోపించారు. రాష్ట్రంలో ‘దుశ్యాసన పర్వం’ కొనసాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా శాసనసభ్యులుగా తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

పోలీసుల దాడి రాష్ట్రంలోని మహిళలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మా ట్లాడుతూ.. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేద న్నారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డిపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘శాసనసభనా.. లేక రౌడీ రాజ్యమా?‘ అని ప్రశ్నించారు. జరిగిన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీ సులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలపైనా అతిగా ప్రవ ర్తించారని నేతలు ఆరోపించారు. కేటీఆర్‌ను గొం తు పట్టుకుని లాగారని, హరీష్‌రావు చొక్కా చించేశారని చెప్పారు. తమ నా యకుడు జగదీష్‌రెడ్డి సైతం స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు. మీడి యా ప్రతినిధులతోనూ పోలీసులు దు రుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సీఎం మాట్లాడే బూతు భాష తమ ఎ మ్మెల్యేలు ధరించిన టీషర్టులపై లేదని బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు