సర్వాయి పాపన్నకు విజయం దక్కాలి
సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేశ్‌గౌడ్ లింగంపల్లి ఓ యానిమేషన్ మూవీ రూపొందించారు. ‘సర్దార్ సర్వాయి పాపన్న‘ పేరుతో రూపొందిన ఈ సినిమాను ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.
బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించిన ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. పాపన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా” అన్నారు. దర్శక నిర్మాత వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. “మా సినిమా ‘బాహుబలి’లా భారీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం” అని తెలిపారు. హీరోయిన్ పాయల్ ముఖర్జీ, సింగర్ ఏపూరి సోమన్న, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పొన్న రవిచంద్ర, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. పలు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






