మక్కాలో హై అలర్ట్

16-09-2026 | 03:30pm

 సౌదీఅరేబియా : మక్కాపై దాడికి హూతీలే కారణమని సౌదీ ఆరోపించింది. సౌదీ ఆరోపణలను హూతీలు(Houthis) తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి(Military Alliance) ప్రతినిధి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... మక్కా పవిత్ర నగరంపై ఉన్న నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే, ఆ నగరానికి దక్షిణాన హూతీల డ్రోన్‌ను సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. ఇస్లాం  అత్యంత పవిత్ర నగరంపై దాడికి ప్రయత్నించారని ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా(Saudi Arabia) ఆరోపించింది. దీంతో ఆ ప్రాంతంలోని దేశాలు దీనిని ఖండించినప్పటికీ, సైనిక మద్దతు మాత్రం కనబడలేదు. అమెరికాకు కీలక మిత్రదేశమైన ఆ రాజ్యం ఇరాన్ యుద్ధంలో కొత్త ముందడుగు వేస్తూ మక్కాను రెడ్ లైన్ గా ప్రకటించింది. సౌదీల ప్రాంతీయ శత్రువైన టెహ్రాన్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారుల నుండి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున ఆ రాజ్యానికి తన ముడి చమురు కోసం ఒక సురక్షితమైన మార్గంతో పాటు సైనిక మద్దతు కూడా అవసరమని తెలిపింది. 

యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీలు సౌదీ అరేబియాలోని మౌలిక సదుపాయాలపై, అలాగే ఎర్ర సముద్రంలో(Red Sea) దాని నౌకా రవాణాపై దాడులు చేస్తుండటంతో, ఒక కీలకమైన సౌదీ పైప్‌లైన్‌ను వారాలుగా మూసివేశారు. ఇరాన్ ఇప్పటికీ హోర్ముజ్ జలసంధిలో నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగానే ఉన్నాయి. యెమెన్ సరిహద్దు నుండి సుమారు 1,100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను(Drone attack on Mecca) ప్రయోగించినట్లు వచ్చిన ఆరోపణలను హూతీలు ఖండించారు. ప్రవక్త ముహమ్మద్ జన్మస్థలం మీదున్న గగనతలంలోకి ప్రవేశించకముందే డ్రోన్‌ను అడ్డుకుని ధ్వంసం చేశామని సౌదీ అధికారులు(Saudi officials) తెలిపారు. వారాంతంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో, మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంఘర్షణను ముగించేందుకు బీజింగ్ సహాయం అందిస్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మరోసారి ప్రకటించారు.

మరిన్ని వార్తలు