నామాపూర్ పాఠశాలకు శాస్త్రవేత్త మన్నే ఉపేందర్ చేయూత

10-09-2026 | 10:25pm

ఫర్నిచర్, ప్రింటర్, సౌండ్ బాక్స్, ప్రొజెక్టర్ అందజేత

అదనపు తరగతి గది నిర్మాణంతోపాటు విద్యార్థులకు వసతుల కల్పన

పాపన్నపేట: మండలంలోని నామాపూర్ ప్రాథమిక పాఠశాల(Namapur Primary School) అభివృద్ధికి అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మన్నే ఉపేందర్(Scientist Manne Upender) అండగా నిలిచారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌తోపాటు ప్రింటర్, సౌండ్ బాక్స్, ప్రొజెక్టర్ వంటి ఎలక్ట్రానిక్ సామాగ్రిని గురువారం అందజేశారు. అంతేకాకుండా పాఠశాలకు అదనపు తరగతి గదిని నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్‌తోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చి, మౌలిక వసతులు కల్పించిన డాక్టర్ మన్నే ఉపేందర్‌కు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేవలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు