హైదరాబాద్‌లో సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ రెండో సీజన్
ఆటగాళ్ల వేలం పూర్తి
లీగ్‌కు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 9: హైదరాబాద్ నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపిన ‘సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్’ (Center Court Pickleball League) రెండో సీజన్ మళ్లీ భాగ్యనగరానికే చేరుకోనుంది. థాయిలాండ్‌లోని పుకెట్ వేదికగా ఈ నెల 3 నుంచి 6 వరకు నిర్వహించిన ఫ్రాంచైజీ యజమానుల వీకెండ్, సీజన్-2 ఆ టగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
గత ఏడాది ‘హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్’ (హెచ్‌పీఎల్) పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు ‘సీసీపీఎల్’గా మరింత ఆకర్షణీయంగా రెండో సీజన్‌కు సిద్ధమైంది. లీగ్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. వేలానికి ముందే పలు ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపెట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడు. మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తర ఫునే బరిలోకి దిగనున్నారు.
కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. లీగ్ ప్రస్థా నం హైదరాబాద్‌లోనే ప్రారంభమైందనీ, ఇక్కడి నుంచే ఫ్రాంచైజీ ఆధారిత పికిల్‌బాల్ లీగ్ సామర్థ్యాన్ని గుర్తించామనీ సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల తెలిపారు. తొలి సీజన్ అనుభవాలతో రెండో సీజన్‌ను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు.