కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తి
27-09-2026 | 03:02pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి ) : నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన బాపూజీ ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా సేవకు, సామాజిక న్యాయానికి అంకితమైన మహోన్నత వ్యక్తి అని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఆర్ఐ రత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.