దొరల పెత్తనాన్ని ధిక్కరించిన ధీరవనిత చాకలి ఐలమ్మ..!
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మహిళా పోరాట స్ఫూర్తికి చిరస్మరణీయ ప్రతీక
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చాకలి ఐలమ్మ 41వ వర్థంతి
షాద్ నగర్ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali ilamma) స్ఫూర్తి చిరస్మరణీయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా గురువారం షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే(Shadnagar MLA) పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
సామాజిక వివక్ష, వెట్టి చాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.