అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తావా..!?

10-09-2026 | 01:10pm

ప్రజలు రాజకీయ "సమాధి" కట్టడం తథ్యం 

అసెంబ్లీ స్పీకర్ దళితుడని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు

కేసీఆర్ తీరుపై నిప్పులు చేరిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా లేకుంటే ఫామ్ హౌస్ లోనే ఉంటా.. అసెంబ్లీలో సమావేశాలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తా.. ఇవే నేటి ప్రతిపక్ష నేత కేసీఆర్ కుట్రలని, ఈ కుట్రలకు బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడరని, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకానిదని KCR కుటుంబానిధి కాదని.. కేసీఆర్ కు ప్రజలు రాజకీయ సమాధి కట్టక తప్పదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్  ధ్వజమెత్తారు.

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభకు దళితుడు స్పీకర్ అయినందువల్లే ఒక దుర అహంకారంతో అసెంబ్లీకి రావడం కేసీఆర్ మానేశారని ఘాటుగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత గల ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు రావాలా వద్ద ప్రజలే చెప్పాలని అడిగారు. 

ఒక అహంకార ధోరణితో దొరలా వ్యవహరిస్తున్న కేసీఆర్ రాజకీయ జీవితానికి ప్రజలే సమాధి కడతారని ఎమ్మెల్యే శంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ తన బాధ్యత తెలుసుకునే వరకు మా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బెదిరింపులకు దిగిన సోషల్ మీడియాలో తిట్టినా, కొంతమంది సోషల్ మీడియాలోనూ ఖరీదు చేసినా తను భయపడే ప్రసక్తే లేదని వాస్తవాలే మాట్లాడతానని శంకర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకు ఏదో ఒక రోజు ముగింపు ఉంటుందని ప్రళయం వస్తుందని అది ప్రకృతి ధర్మమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.

గతంలో మహనీయులు అన్ని పోరాటాలు ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు కాబట్టే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ఇప్పుడు కూడా దుర్మార్గాలను ప్రశ్నించకపోతే భవిష్యత్తు మునగడ ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఎవరో ఒకరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఈరోజు ప్రతిపక్ష నేతల తీరు చూస్తుంటే బాధ కలుగుతుందని వాళ్లకు పదవులు అధికారం లేవని దుర్మార్గాలకు తెగబడుతున్నారని అన్నారు. రెండుసార్లు కేసీఆర్ కు అధికారం కట్టబెట్టిన వారిలో అధికార దాహం తీరడం లేదని, ఒక్కసారి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఎంత అభివృద్ధి చేస్తుందో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రశ్నించడానికి అని ప్రతి ఒక్కరు ప్రతిపక్ష అక్రమాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తను ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.

మరిన్ని వార్తలు