షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు
ముకరంపుర,సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): షహీద్ భగత్ సింగ్ ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో భగత్ సింగ్(Bhagat Singhs) జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరలోని తీగలగుట్ట పల్లి మేయర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభూమి విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మాతృభూమి విముక్తి కోసం పోరాడిన గొప్ప వీరుడు షహీద్ భగత్ సింగ్ అన్నారు. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన త్యాగం, దేశభక్తి ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాధంతో దేశ యువతలో స్వాతంత్ర్య ఆంక్షను రగిలించిన గొప్ప పోరాట యోదుడన్నారు.ఈ కార్యక్రమంలో నిఫా రాష్ట్ర కో ఆర్డినేటర్ కే. యాదవ రాజు, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.