ORRపై మృత్యుఘోష.. ముగ్గురు మృతి
శామీర్ పేట్,సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్(ORR)పై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లైలాండ్ వాహనం టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డుపై నిలిపి టైర్ మారుస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన లారీ ట్రాక్ వాహనాన్ని వెనుక నుంచి అతి వేగంగా వచ్చి డీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు వృత్తి చెందారు.మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండ మార్గ మధ్యలో మృతి చెందాడు. దీనితో ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంపై శామీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.