calender_icon.png 31 August, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి విజ్ఞాన మేళకు శిశు మందిర్ విద్యార్థులు

30-08-2025 08:53:31 PM

కుమ్రం భీం  ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళకు ఎంపికైనట్లు ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులు సెప్టెంబర్ మూడు, నాలుగు, ఐదు తేదీలలో కామారెడ్డి పట్టణంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి విజ్ఞానమేళలో పాల్గొంటారు. మూడు జిల్లాలకు సంబంధించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ కొత్తపల్లి అనిత, శ్రీ సరస్వతీ విద్యా పీఠం జిల్లా అధ్యక్షులు బహుమతులు ప్రధానం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్యులు అభినందించారు. శిశువర్గ. వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రథమ. చి,పోలంపల్లి. శార్వాని 4th బాలవర్గ. సంస్కృతి జ్ఞాన ప్రశ్నమంచ్ విభాగంలో ప్రథమ. వెంకటరత్న,చరణ్ సాకేత్,హరిచరణ్ సైన్స్ మాడల్. సుసైడ్ రిడెక్షన్ అంశంలో ప్రథమ. బొంతల దివ్య 8వ తరగతి మ్యాథ్స్ మాడల్  ప్రథమ. బోయిరే.జశ్వంత్ 8వ తరగతి వాటర్ మేనేజ్మెంట్ విభాగంలో ద్వితీయ. శ్రీ నిహారిక 8వ తరగతి fossil fuel 2nd గుత్తి విక్రమ్ ద్వితీయ సంస్కృతి జ్ఞాన ప్రశ్న మంచ్ ద్వితీయ. రేవంత్,సహస్ర, శ్రీనిధి నిలిచారు.