ఛోటీ సాన్సే.. బడీ ఉమ్మీదేం’

27-09-2026 | 05:20am

స్టార్ హాస్పిటల్స్‌లో ఆత్మీయ కలయిక

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): వరల్డ్ హార్ట్ డే (World Heart Day)సందర్భంగా ప్రము ఖ స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఛోటీ సాన్సే, బడీ ఉమ్మీదేం (చిన్న శ్వాసలు ఆశలు) పేరుతో ప్రత్యేక ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 నుంచి 9 సంవత్సరాల క్రితం క్లిష్టమైన పీడియాట్రిక్ గుండె శస్త్రచికిత్సల అనంతరం కోలుకున్న చి న్నారులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్నారుల ఆరో గ్యం, వారు ఎదుర్కొన్న కష్టాలను అధిగమించిన పట్టుదల, నూతన జీవి త ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ వేడుక నిర్వహించారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ (హైదరాబాద్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మెడక్కర్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల ప్రాణాలపై కరుణతో కూడిన వైద్యసేవలు చూపించే ప్రభావాన్ని గుర్తుచేస్తాయన్నారు. శస్త్రచికిత్స జరిగిన ఎన్నో యేళ్ల తర్వాత పిల్లలు ఆరోగ్యంగా, ఆశలతో తిరిగి రావడం స్ఫూర్తిదాయకమన్నారు. బంజారాహిల్స్లోని స్టార్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారుల కోసం పలు కార్యక్రమాలను నిర్వహించారు. 

చిత్రలేఖ నం, క్యారికేచర్ సెషన్స్ ఏర్పాటు చేశారు. డ్రాయింగ్ పోటీలు నిర్వహించ డంతో పాటు, ప్రత్యక్షంగా రూపొందించిన క్యారికేచర్లను జ్ఞాపకాలుగా అందించారు. కార్య కమానికి హాజరైన తల్లిదండ్రులకు  ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ మన్నం, ఆయన వైద్య బృందం పాల్గొనడం కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని వార్తలు